హాబీస్: చిరంజీవి నుంచి తమన్నా దాకా..
on Jul 12, 2020
లాక్‌డౌన్‌ను ప్రభుత్వాలు ఎత్తివేసినా, షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేసినా చాలామంది తారలు ఇప్పటికీ ఇళ్లల్లోనే గడుపుతున్నారు. కరోనా మహమ్మారి రోజు రోజుకీ ఆందోళనకర స్థాయిలో ఉధృతమవుతుండటం దీనికి కారణం. ఇప్పటికే టీవీ రంగానికి చెందిన కళాకారులు పలువురు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, తాజాగా బాలీవుడ్లో అమితాబ్ కుటుంబం సహా పలువురు కరోనా బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దాంతో చాలామంది షూటింగ్‌లు పునఃప్రారంభిస్తే యూనిట్ సభ్యులు ప్రమాదంలో పడతారని భావిస్తున్న తారలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ సమయంలో తమ పాత హాబీలను మరోసారి వెలికి తీస్తున్నారు. కొంతమంది ఫిట్‌నెన్ మీద, కొంతమంది వంటల మీద, ఇంకొంతమంది గార్డెనింగ్ మీద.. ఇలా తమ అలవాట్లపై ఫోకస్ పెడుతున్నారు. అలా కొంతమంది సౌత్ స్టార్స్ ఏమేం చేస్తున్నారో చూద్దామా...
1. చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఓవైపు దోశలు వేస్తూ, వాళ్లమ్మ చేత తినిపిస్తూ, మరోవైపు మొక్కలకు నీళ్లు పోస్తూ గడిపేస్తున్నారు.
2. మమ్ముట్టి
వెటరన్ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి ఒకప్పుడు ఫొటోగ్రఫీ అనేది హాబీగా ఉండేది. ఇప్పుడు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ మాదిరిగా ఫొటోలు తీస్తున్నారు.
3. సమంత అక్కినేని
అక్కినేని వారి ఇంటి కోడలు సమంత తమ ఇంటి టెర్రస్‌పై గార్డెన్ పెంచుతున్నారు. ఆ గార్డెన్లో ఏమేం పెంచుతున్నారో తన అభిమానులకు షేర్ చేస్తూ వస్తున్నారు.
4. దుల్కర్ సల్మాన్
మమ్ముట్టి కొడుకైనా నటుడిగా ఇప్పటికే తనదైన ముద్రవేసిన దుల్కర్ సల్మాన్ గార్డెనింగ్‌తో పాటు ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ ఫ్యామిలీ మెప్పు పొందుతున్నారు.
5. పూజా హెగ్డే
కావాల్సినంత తీరిక దొరకడంతో వంటగదిలో ప్రయోగాలు చేస్తూ వస్తున్న పూజా హెగ్డే.. హల్వా దగ్గర నుంచి క్యారెట్ కేక్ దాకా రకరకాల డిషెస్ చేస్తోంది.
6. విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ టైమ్‌ను ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. చెస్ నుంచి పచ్చీస్ దాకా రకరకాల ఆటలు ఆడుతున్నాడు.
7. తమన్నా భాటియా
ఓవైపు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే, మరోవైపు కిచెన్‌లోనూ ప్రయోగాలు చేస్తూ అమ్మానాన్నలను సంతోషపెడుతోంది తమన్నా.