చరణ్ - శంకర్ చిత్రంలో సౌత్ కొరియన్ యాక్ట్రస్?
on Feb 24, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జట్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ చిత్రం పాన్ - ఇండియా మూవీగా కాకుండా పాన్ - ఆసియా మూవీగా రూపొందనుందట. అంతేకాదు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సౌత్ కొరియన్ యాక్ట్రస్ `బే సుజీ` నటించబోతోందట. `ఆర్కిటెక్చర్ 101`, `ద సౌండ్ ఆఫ్ ఎ ఫ్లవర్`, `యాష్ ఫాల్` వంటి చిత్రాల్లో సుజీ ప్రధాన పాత్రల్లో నటించింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `వండర్ లాండ్`.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్స్ లోకి రానుంది.
మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాల్లో నటిస్తున్నారు. `ఆచార్య`లో మెగాస్టార్ చిరంజీవితోనూ, `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ యన్టీఆర్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు చరణ్. ఐదు నెలల గ్యాప్ లో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.