క్రాక్ రీమేక్‌లో సోనూసూద్?
on Jan 16, 2021
ఈ ఏడాదిలో తొలి బ్లాక్ బస్టర్.. క్రాక్. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ పవర్ ఫుల్ కాప్ డ్రామా.. రిలీజ్ టైమ్ లో ఇబ్బందులు చూసినా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. వసూళ్ళు కూడా స్టడీగానే ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు.
ఇదిలా ఉంటే.. క్రాక్ ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాని రియల్ హీరో సోనూ సూద్ తనే స్వయంగా నిర్మిస్తూ రవితేజ పాత్రలో నటించే దిశగా ప్రణాళికలు వేస్తున్నారని తెలిసింది. అంతేకాదు.. ఇకపై కథానాయకుడిగానే కొనసాగే ఆలోచనతో ఉన్నారట సోనూ. అందుకే.. ప్రస్తుతం ఉన్న విలన్ రోల్స్ తాలూకు కమిట్ మెంట్స్ పూర్తయ్యాక కంప్లీట్ గా హీరో వేషాలపైనే ఫోకస్ పెడుతున్నట్లు వినికిడి. మరి.. క్రాక్ రీమేక్ తో సోనూ సూద్ బాలీవుడ్ లో కథానాయకుడిగా తన సత్తా చాటుతారేమో చూడాలి.