ఈ బాలయ్య హీరోయిన్‌కు రెండు సార్లు పెళ్లాడాలని ఉందంట!
on Jan 18, 2021
వి.ఎన్. ఆదిత్య డైరెక్ట్ చేసిన 'రెయిన్బో' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సోనాల్ చౌహాన్‌కు పేరు తెచ్చింది మాత్రం బాలకృష్ణతో చేసిన సినిమాలే. బాలయ్యతో ఆమె లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించింది. ఆయనతో వంద సినిమాల్లో నటించాలని ఉందని అప్పట్లో ఆమె చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. లేటెస్ట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో అలాంటి సంచలనమే సృష్టించింది సోనాల్.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, తరచూ తన గ్లామర్ పిక్చర్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు హుషారునిస్తూ వుంటుంది. తాజా ఇంటర్వ్యూలో తనకు ఒకసారి కాకుండా రెండు సార్లు పెళ్లిచేసుకోవాలని ఉందని చెప్పి అందర్నీ షాక్‌కు గురిచేసింది. "నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను రెండుసార్లు పెళ్లాడాలని అనుకుంటున్నాను." అని ఆమె ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రకృతికి, ఆమె రెండు పెళ్లిళ్లకు సంబంధమేంటని ఎవరికైనా ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఒకసారి బీచ్ దగ్గర, ఇంకోసారి ఎత్తైన కొండమీదా పెళ్లి చేసుకోవాలని తన కోరిక అంటూ తెలిపింది సోనాల్.
పెళ్లి గురించి ఇలాంటి కోరిక తనలో ఉంచుకుంది కాబట్టి, ఇప్పటికే ఆమె సరైన వ్యక్తిని ఆమె ఎంచుకొని ఉంటుందని ఎవరైనా అనుకోవచ్చు. దానికి కూడా క్లారిటీ ఇచ్చిందామె. "నా లైఫ్‌లో ఇప్పుడు ఎవరూ లేదు. నేను సింగిల్." అని స్పష్టం చేసింది సోనాల్.