లేసీ స్విమ్‌సూట్‌లో కవ్విస్తున్న సోనాక్షి!
on Nov 23, 2020
బాలీవుడ్ సొగసరి సోనాక్షి సిన్హా ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. ఆ ఐలాండ్ కంట్రీ నుంచి ఓహో అనిపించే స్టన్నింగ్ పిక్చర్స్‌తో తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాల్దీవులు ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్‌గా మారింది. గత రెండు వారాలుగా అనేకమంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో సన్‌బాత్‌లు చేస్తూ, తమ వెకేషన్‌కు సంబంధించిన గార్జియస్ పిక్చర్స్‌ను షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా దబాంగ్ హీరోయిన్ సోనాక్షి కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా సెలవులు గడిపేందుకు మాల్దీవులకు వచ్చింది. అక్కడ ల్యాండ్ అయినాక పలు ఫొటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తోంది.
సోమవారం ఆమె బ్లాక్ అండ్ వైట్ లేసీ స్విమ్‌సూట్ ధరించి బీచ్‌లో కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. వాటికి “Happiest in the water (sic),” అనే క్యాప్షన్ జోడించింది. సూర్యాస్తమయం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఆ ఫొటోలో సోనాక్షి అందాల్ని వర్ణింప శక్యం కాదన్నట్లు ఉంది. ఆ పోస్ట్‌ను కత్రినా కైఫ్, అనన్యా పాండే, హ్యుమా ఖురేషి, షాహిద్ కపూర్, కృతి సనన్ లాంటి పాపులర్ సెలబ్రిటీలు లైక్ చేయడం గమనార్హం.
దాంతో పాటు అదే స్విమ్‌సూట్‌లో నీటిలోంచి బయటకు వచ్చి ఇసుకలో కూర్చున్న మరో పిక్చర్‌ను కూడా షేర్ చేసిన సోనాక్షి దానికి "ఐలాండ్ గాళ్" అనే క్యాప్షన్ పెట్టింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
