సాయి ధరమ్ తేజ్ 'సోలో...' ప్రతిజ్ఞ
on Jan 23, 2020
సాయి ధరమ్ తేజ్ ఒక క్లబ్ స్టార్ట్ చేశారు. క్లబ్ సభ్యులతో కలిసి బుధవారం విశాఖ గీతం యూనివర్సిటీలో ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే... ప్రేమ, రిలేషన్షిప్ లో పడబోమని! అతడికి నభా నటేష్ సవాల్ విసిరారు. ఎలాగైనా ప్రేమలో పడేస్తానని. వీరిద్దరి కథేంటో 'సోలో బతుకే సో బెటర్' సినిమాలో చూడాలి. ప్రజెంట్ ఈ సీన్స్ విశాఖ గీతం యూనివర్సిటీలో షూట్ చేస్తున్నారు.
'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' విజయాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా 'సోలో బతుకే సో బెటర్'. ప్రజెంట్ విశాఖలో షూటింగ్ చేస్తున్నారు. అందులో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ కూడా పాల్గొంటున్నారు. లవ్, రిలేషన్షిప్ అంటే పడని ఒక యువకుడు 'సోలో బతుకే సో బెటర్' అని క్లబ్ ఫామ్ చేస్తాడు. అతడికి హీరోయిన్ సవాల్ విసిరి లవ్ లో పడేయడం సినిమా కథ అని తెలుస్తుంది. ఇంతకు ముందు ఇటువంటి లైన్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. కొత్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాను ఎలా డీల్ చేస్తాడనేది చూడాలి.