వివాదంలో సింగర్ సునీత భర్త!
on Jan 25, 2022
ప్రముఖ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఓ వివాదంలో చిక్కుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతున్న 'నాలో నేను' అనే సినిమాలో గౌడ సామాజికవర్గానికి చెందిన మహిళలను కించపరిచేలా సీన్స్ ఉన్నాయట. దీంతో ఆ కుల సంఘాల నేతల ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది.
రామ్ కి చెందిన యూట్యూబ్ ఛానల్ లో 'నాలో నేను' అనే సినిమా ప్రసారమవుతోంది. అయితే ఈ సినిమాలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ గౌడ కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు మంగళవారం ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై దాడికి కూడా యత్నించినట్టు సమాచారం. తమ సామాజికవర్గ మహిళలను కించపరిచేలా ఉన్న ఆ సన్నివేశాలను వెంటనే డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదంపై రామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా, సింగర్ సునీత గతేడాది రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read