తమన్‌కి ఇక్కడ హిట్.. అక్కడ ఫట్..
on Jan 18, 2021
తెలుగునాటే కాదు తమిళ చిత్ర సీమలోనూ తనవైన స్వరాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం తమన్. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో రెండు వేర్వేరు భాషల్లో రెండు సినిమాలతో సందడి చేశాడీ టాలెంటెడ్ కంపోజర్. అయితే ఒక భాషలో విజయం అందుకున్న తమన్.. మరో భాషలో పరాజయం చవిచూశాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది పొంగల్ బరిలో విడుదలైన మాస్ మహారాజా రవితేజ స్టారర్ క్రాక్ చిత్రంతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూటగట్టుకున్న తమన్.. ఆ సినిమా రిలీజైన ఐదు రోజులు తరువాత తమిళంలో ఈశ్వరన్ తో సందడి చేశాడు. కోలీవుడ్ స్టార్ శింబు, అందాల తార నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ విలేజ్ డ్రామా.. ఔట్ డేటెడ్ మూవీగా విమర్శలు అందుకోవడమే కాకుండా నిరాశపూరిత వసూళ్ళతో ముందుకు సాగుతోందని అక్కడి ట్రేడ్ టాక్.
మొత్తమ్మీద.. తమన్ కి క్రాక్ రూపంలో తెలుగునాట బ్లాక్ బస్టర్.. ఈశ్వరన్ రూపంలో తమిళనాట ఫట్ ఖాతాలో చేరాయన్నమాట.