బిగ్ బాస్‌లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందో చూడండి...
on Oct 15, 2020
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్ 14 లో హినా ఖాన్, 'చిన్నారి పెళ్లికూతురు' హీరో సిద్ధార్థ్ శుక్లాను వీక్షకులు ఇష్టపడుతున్నారు. వారి ఫన్నీ పాయింట్స్ ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలి ఎపిసోడ్లో, సిద్ధార్థ్ శుక్లాను హినా ఖాన్ "ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా?" అని అడిగింది. దీనికి సిద్ధార్థ్ శుక్లా, "లేదు" అని సమాధానమిచ్చి, "ఎందుకు అలా అడుగుతున్నార"ని హినా ఖాన్‌ను ప్రశ్నించాడు. "నేను మీ ఫ్రెండ్‌ని కాబట్టి" అని చెప్పింది హినా.
దానికి సిద్ధార్థ్ శుక్లా, "మీరు నా ఫ్రెండ్ అని మీకెవరు చెప్పారు? మీరు నా ఫ్రెండ్ కాదు. మీరు హినా ఖాన్, నేను సిద్ధార్థ్ శుక్లా.. మనం స్నేహితులు కాము" అన్నాడు. అతడు చెప్తుంటే అతనివైపే చూస్తూ ఉన్న హినా ఖాన్ నవ్వు ఆపుకోలేకపోయింది. ఈసారి బిగ్ బాస్ లో 14 మంది పోటీదారులు ఉన్నారు. వారిలో ముగ్గురు 'తుఫానీ' సీనియర్లు ఉన్నారు. వారు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈసారి బిగ్ బాస్ లో 'తిప్పరా మీసం' హీరోయిన్ నిక్కి తంబోలి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఆమె బలమైన పోటీదారుగా ఎదిగింది. మొదటి రెండు టాస్క్‌లను గెలవడంతో పాటు, ఆమె హౌస్‌లో కన్ఫామ్ అయిన మొదటి కంటెస్టెంట్ కూడా. ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మార్చడంలో దిలాక్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ షాను వంటి ఆర్టిస్టులు కృష్టి చేస్తున్నారు. ఈ షోలో మొదటగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా పంజాబీ నటి, సింగర్ సారా గుర్పాల్ నిలిచింది.
Also Read