పండగ పూట `శ్యామ్ సింగ రాయ్` టీజర్ ముచ్చట
on Mar 8, 2021
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పిరియడ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బెంగాలీ యువకుడిగా, తెలుగు కుర్రాడిగా రెండు డిఫరెంట్ టైమ్ లెన్స్ కి చెందిన పాత్రల్లో సందడి చేయబోతున్నారట నాని. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. నాని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన `శ్యామ్ సింగ రాయ్` ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. త్వరలోనే టీజర్ ని విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఉగాది పర్వదినాన `శ్యామ్ సింగ రాయ్` టీజర్ రిలీజ్ కానుందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా, నాని తాజా చిత్రం `టక్ జగదీష్` ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. `నిన్ను కోరి` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని నటించిన సినిమా కావడంతో `టక్ జగదీష్`పై మంచి అంచనాలే ఉన్నాయి.