`సలార్`లో శ్రుతి రోల్ అదేనా?
on Apr 19, 2021
రి-ఎంట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతోంది శ్రుతి హాసన్. సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ `క్రాక్`, వేసవిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్`.. ఇలా స్టార్ హీరోల కాంబినేషన్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూసింది శ్రుతి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ `సలార్`లో కథానాయికగా నటిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ యాక్షన్ సాగాని `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. హొంబళే ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో శ్రుతి పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `సలార్`లో జర్నలిస్ట్ పాత్రలో మిస్ హాసన్ దర్శనమివ్వనుందట. కేవలం గ్లామర్, పాటలకు పరిమితం కాకుండా కథలో కీలకమైన పాత్రగా శ్రుతి క్యారెక్టర్ ఉంటుందని టాక్. త్వరలోనే శ్రుతి హాసన్ పాత్రకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న `సలార్`.. 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది.