టాలీవుడ్లో నెపోటిజమ్ గురించి శృతి హాసన్ ఏమన్నదంటే?
on Aug 8, 2020
తన ఇంటి పేరు హాసన్ విలువ ఏంటో తనకు తెలుసుననీ, సినిమా రంగుల ప్రపంచంలో సులభంగా తనకు తలుపులు తెరచుకోవడానికి అదే కారణమని కమల్ కుమార్తె శృతి హాసన్ అన్నారు. 'జీ 5'లో విడుదలైన 'యారా' ప్రచారం నిమిత్తం వెబినార్ ఇంటర్వ్యూలు ఇచ్చిన శృతి హాసన్ బాలీవుడ్లో నెపోటిజమ్ గురించి, సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేస్తానని తనపై వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడారు. శనివారం సాయంత్రం తన ఒరిజినల్ సాంగ్ 'ఎడ్జ్' రిలీజ్ సందర్భంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి మాట్లాడారు.
"నాన్న వల్ల ఇండస్ట్రీలో నాకు ఎంట్రీ ఈజీగా దొరికింది. కానీ, నాన్న నాకు సినిమా ఛాన్సులు రావడంలో ఏమీ సహాయం చేయలేదు. తమిళ్, ఆ మాటకొస్తే... తెలుగులో ఇండస్ట్రీలో మెరిట్ ఆధారంగా ఛాన్సులు ఇస్తారు. మీకు టాలెంట్ ఉంటే మీకంటూ ఒక మార్క్ ఏర్పడుతుంది. సౌత్ ఇండస్ట్రీలలో గ్రూపిజమ్ లేదు. అలాగని, నెపోటిజమ్ లేదని నేను చెప్పడం లేదు. అప్రోచ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందంతే" అని శృతి హాసన్ పేర్కొన్నారు.
Also Read