'చంద్రముఖి'కి 'సాహో' హీరోయిన్ నో...
on Sep 6, 2019
తెలుగు, తమిళ ప్రేక్షకులకు చంద్రముఖి అంటే జ్యోతిక గుర్తొస్తారు. పాత్రలో ఆమె నటన అంతలా ప్రభావం చూపించింది మరి! అదే ఉత్తరాది జనాలకు చంద్రముఖి అంటే విద్యా బాలన్ గుర్తొస్తారు. ‘చంద్రముఖి’ హిందీ రీమేక్ ‘భూల్ భులైయా’లో రజనీకాంత్ పాత్రలో అక్షయ్‌కుమార్, జ్యోతిక పాత్రలో విద్యా బాలన్ నటించారు. హిందీలో ‘భూల్ భులైయా’కు సీక్వెల్ తెరకెక్కుతోందిప్పుడు. ఇందులో ‘ప్యార్ కా పంచనామా’, ‘సోను కె టీటు కి స్వీటీ’, ‘లుకా చుప్పీ’ ఫేమ్ కార్తీక్ ఆర్యన్ హీరో. అతడి పక్కన హీరోయిన్గా నటించమని ‘సాహో’ ఫేమ్ శ్రద్ధా కపూర్‌ను సంప్రదించగా... ఆమె డేట్స్ ఖాళీ లేవని ‘నో’ చెప్పిందట. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కూడా ‘భూల్ భులైయా 2’కు నో చెప్పిందట. ఎవరు ‘యస్’ అంటారో చూడాలి. హీరోయిన్ సంగతి పక్కన పెడితే... ఈ సినిమాలో చంద్రముఖిగా ఎవరు కనిపిస్తారో? అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భూల్ భులైయా 2’ను వచ్చే ఏడాది జూలై 31న విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.