English | Telugu

శివాత్మిక రాజశేఖర్... ప్రకాష్ రాజ్ కూతురు!

on Dec 13, 2019

అదేంటి? శివాత్మిక అంటే యాంగ్రీ హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతుల రెండో కుమార్తె కదా! ప్రకాష్ కూతురు అంటున్నారు ఏంటి అనే సందేహం వచ్చిందా? నిజమే... నిజ జీవితంలో రాజశేఖర్ కుమార్తె. కృష్ణవంశీ చిత్రంలో మాత్రం ఆమె ప్రకాష్ రాజు కూతురు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా... బ్రహ్మానందం ప్రధాన పాత్రలో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగ మార్తాండ'. ఇందులో శివాత్మిక రాజశేఖర్ నటిస్తోంది.

'రంగ మార్తాండ'లో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ దంపతుల కుమార్తెగా శివాత్మిక కనిపించనుంది. వృత్తిరీత్యా గాయని పాత్ర. 'దొరసాని' తర్వాత శివాత్మిక నటిస్తున్న చిత్రం ఇదే. ఆ సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చింది. లుక్స్ పరంగా, నటన పరంగా ‌ ప్రేక్షకుల నుండి, పరిశ్రమ వర్గాల నుండి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో అనుకున్న పేరు శివాత్మికకు రాలేదు. 'రంగ మార్తాండ'తో పెద్ద గుర్తింపు లభిస్తుందని ఆమె ఆశిస్తోందట. కథానాయికలను చూపించడంలో కృష్ణవంశీ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!


Cinema Galleries



Latest News


Video-Gossips