పురుషాంగం ఆకారంలోని బర్త్‌డే కేక్ కట్ చేసిన టీవీ నటిపై విమర్శల వెల్లువ!
on Sep 18, 2020
నేషనల్ టీవీలో ప్రసారమయ్యే స్టంట్ రియాలిటీ షో 'ఖత్రోం కే ఖిలాడీ - మేడ్ ఇన్ ఇండియా'లో జాస్మిన్ భాసిన్, కరణ్ వాహిలను ఓడించి విన్నర్‌గా నిలిచిన టీవీ సెలబ్రిటీ నియా శర్మ సెప్టెంబర్ 17న తన 30వ బర్త్‌డే వేడుక జరుపుకుంది. దీనికి ఇండస్ట్రీలోని ఆమె సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి టైమ్‌లోనూ అర్జున్ బిజ్లానీ, రేనా పండిట్, రాహుల్ సుధీర్, అమ్రిన్ చక్కీవాలా, మరికొంత మంది నియా బర్త్‌డే వేడుకను సంబరంగా మార్చేశారు. ఆనందంతో తబ్బిబ్బయిన నియా ఇది తన జీవితంలో "ద బెస్ట్ డర్టీ థర్టీయెత్" అంటూ అభివర్ణించింది. ఇదంతా ఒకెత్తు అయితే, ఆ వేడుకలో ఆమె పురుషాంగం ఆకారంలో తయారుచేసిన కేక్‌ను కట్ చేయడం ఇంకో ఎత్తు. ఆ కేక్‌ను చూస్తూ ఆమె ఎంత సంభ్రమాశ్చర్యాలను ప్రకటించిందో పిక్చర్లో ఈజీగా తెలిసిపోతోంది.
పురుషాంగం షేప్‌లోని కేక్‌ను కట్ చేయడం, దానిని "డర్టీ బర్త్‌డే సెలబ్రేషన్" అని పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్, సోషల్ మీడియాలోని ఆమె ఫాలోయర్లు తీవ్రంగా అసంతృప్తి చెందారు. ఆమె ఫాలోయర్స్ అయినందుకు తాము సిగ్గుపడుతున్నామని తెలిపారు. గురువారం సాయంత్రం నియా శర్మ పోస్ట్ చేసిన రెండు వీడియోలు, పిక్చర్లను చూసిన అనేకమంది సోషల్ మీడియాలో ఆమె వల్గారిటీని ప్రమోట్ చేస్తోందంటూ దుయ్యబట్టారు.
"Shame on u ...cake so cheap," అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నియా ఫాలోయర్ ఒకరు ఆమెను తిట్టేశాడు. సోషల్ మీడియాలో ఇలాంటి పిక్చర్లతో పోస్టులు పెట్టొద్దనీ, ఇలాంటి వాటిని ప్రైవేట్ ఎఫైర్గానే ఉంచుకొమ్మనీ ఇంకొక అభిమాని సలహా ఇచ్చాడు. ఆ వేడుకలో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారనీ, ఇలాంటి పనులు చేస్తే ఆమెకు చెడ్డపేరు వస్తుందనీ కూడా చెప్పాడు. "అంతా బాగానే ఉందికానీ, కేక్ బాగా లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు కంటెంట్ ఎలాంటిది వేస్తున్నామో ఓసారి ఆలోచించి వెయ్యాలి. ఇక్కడ మన సిస్టర్స్, మదర్స్, ఫాదర్స్, బ్రదర్స్, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ఉంటారు." అని అతను క్లాస్ పీకాడు.
Also Read