డైరెక్టర్‌తో 'కృష్ణ అండ్ హిజ్ లీల' హీరోయిన్ పెళ్లి
on Jul 3, 2020
హీరోయిన్గా పట్టుమని పది సినిమాలు చేయకముందే పెళ్లి చేసుకోనున్నట్టు చెప్పి శాలినీ వడ్నికత్తి అటు ఆడియన్స్‌కి, ఇటు ఇండస్ట్రీకి ఓ షాక్ ఇచ్చింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా విడుదలైంది. అందులో రాధ పాత్రలో శాలిని నటించింది. బుధవారం ‘ఆహా’లో విడుదలైన ‘భానుమతి అండ్ రామకృష్ణ’లో చిన్న పాత్రలో తళుక్కుమన్నది. హీరోయిన్‌తో బ్రేకప్ తర్వాత రాజా చెంబోలును పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది. అంతకు ముందు తెలుగులో ‘యురేక’, కన్నడలో మూడు సినిమాలు చేసింది. ‘ఆహా’ ఓటీటీలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదలవుతున్న సందర్భంగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన శాలిని పెళ్లి గురించి చెప్పింది.
‘‘డైరెక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నా’’ అని శాలినీ వడ్నికత్తి వెల్లడించింది. ‘పెళ్లి తరవాత సినిమాల్లో నటిస్తారా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘తప్పకుండా! స్టోరీ నచ్చితే సినిమాలు చేస్తా. ఏది ఏమైనా నేను పెళ్లి చేసుకోబుతున్నా’’ అని శాలినీ వడ్నికత్తి చెప్పింది. ఆ దర్శకుడు ఎవరో?? రమ్యకృష్ణ ఖుష్బూ, రోజా, సోనాలీ బింద్రే ఇలా దర్శకులను పెళ్లి చేసుకొన్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు.
Also Read