English | Telugu

ఇద్దరు కుర్రాళ్లతో.. ఒకే రూమ్ లో.. నరకం చూసిందట !

on Sep 7, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయంలో హీరోయిన్ శాలినీ పాండే పాత్రను తేలిగ్గా కొ్ట్టేయలేం. మూర్తీభవించిన అమాకత్వంతో... ముగ్ధమోహన సౌందర్యంతో యువకులను బుట్టలో వేసేసుకుంది షాలిని. అసలు ఈ షాలిని ఎవరు? ఏ ఊరు? ఎలా సినిమాల్లోకొచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉండటం సహజం. దానికి తగ్గట్టే... షాలిని జీవితం కూడా చాలా ఆసక్తికరమైన మలుపులతో సాగింది. ఇప్పుడొస్తున్న చాలామంది హీరోయిన్లు ఫేస్ చేయని జీవితాన్ని షాలిని ఫేస్ చేసింది. షోషల్ మీడియాలో ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలు చదివితే... కళ్లు చమర్చక మానవు. 

మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కి చెందిన ఓ ప్రభుత్వోజ్యోగి కుమార్తె అయిన శాలినీ పాండేకి... చిన్నప్పట్నుంచీ నటనపై ఆసక్తి. అయితే... తాను నటి అవ్వడం తండ్రికి మాత్రం సుతరామూ ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ల కోసం ఇంజనీరింగ్ ‘మమ’ అనిపించేసిన శాలిని.... తండ్రిని ప్రాధేయపడి ఒప్పించి...థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఓ ఫైన్ మోర్నింగ్... సినీనటి అవ్వాలన్న.. తన మనోభిష్టాన్ని తండ్రి ముందుంచింది. తండ్రి ససేమిరా అన్నడంతో.. ఇంట్లోంచి పారిపోయింది. ముంబయ్ లో తన స్నేహితులతో కలిసి చిన్న రూమ్ లో ఉంటూ ప్రయత్నాలు సాగించింది. డబ్బు లేకపోవడంతో పస్తులున్న రోజులు కూడా ఉన్నాయట. 

ఓ రోజు శాలిని తండ్రికి కూతురు ఆచూకీ తెలిసిపోయింది. ‘మర్యాదగా రాకపోతే, పోలీసులొచ్చి తీసుకొస్తారు?’ అని ఫోన్లో బెదిరించాట్ట. ‘అలాంటి పనులు చేస్తే... నేనే పోలీసు కేసు పెడతా!. నేను మేజర్ ని జాగ్రత్త’ అని తండ్రీ మీదే రివర్స్ అయ్యిందట శాలిని. తన మాట వినని కూతురు తనకు లేనట్టే.. అని డిసైడ్ అయిన షాలిని తండ్రి.. ‘ఇక ఎప్పుడూ నా ఇంటి గడప తొక్కొద్దు’ అని గట్టిగా చెప్పేశాడట. ఇక అక్కడ్నుంచీ షాలినికి అసలు కష్టాలు మొదలయ్యాయ్. ఫ్రెండ్స్ కూడా ఎవరిదారి వాళ్లు చూసుకునే సరికి... డబ్బు, నిలువనీడ కూడా లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఇద్దరు కుర్రాళ్లతో కలిసి ఒకే రూమ్ ని షేర్ చేసుకొని దాదాపు రెండు నెలలు ఉందట శాలిని. ఆ కుర్రాళ్లు చాలా మంచి వాళ్లు అవ్వడంతో అలా ఉండగలిగాననీ, అయితే... ఆ రెండు నెలలూ తనకు నిజంగా నరకమే అని షాలినీ గుర్తు చేసుకుంది. 

చివరకు తన స్నేహితుల సహాయంతోనే షాలినికి ‘అర్జున్ రెడ్డి’ అవకాశం తలుపుతట్టిందట. షూటింగ్ సమయంలో కూడా తన దగ్గర డబ్బులుండేవి కాదట. ఆ సినిమాకు తాను తీసుకుంది కూడా చాలా తక్కువ రెమ్యునరేషనే అని తెలిసింది. అయితే.. ఇప్పుడు మాత్రం కుప్పలు తెప్పలుగా ఆమెకు అవకాశాలు తలుపు తడుతున్నాయ్. పుటం వేస్తే తప్ప బంగారానికి మెరుపు రాదు. ఉలి దెబ్బలు తగిలితే తప్ప.. శిల.. శిల్పంగా మారదు. షాలిని విషయంలో ఇది అక్షర సత్యం అనక తప్పదు. ఏమంటారు ఫ్రెండ్స్. 

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here