తాత వారసత్వాన్ని తీసుకున్న నాగచైతన్య!!
on Sep 10, 2018
నాగచైతన్య గత సినిమా ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడుతూ `` నాగ చైతన్య అంత మంచి వాడు మా ఫ్యామిలీలో ఎవరూ లేరు`` అంటూ కొడుకుని తెగ పొగిడేసాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో రూపొందిన `శైలజారెడ్డి అల్లుడు` చిత్రం ప్రీ రిలీజ్ కు వచ్చిన నాగార్జున చైతు గురించి చెబుతూ...అందరూ చైతు చాలా సాఫ్ట్ అనుకుంటారు కానీ...తనలో చాలా చిలిపితనం దాగుందంటూ ...దాన్ని మారుతి చాలా చక్కగా వాడుకున్నాడంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా చైతన్యను ఇప్పుడందరూ శైలజా రెడ్డి అల్లుడుని అని అంటున్నారు...కానీ తను అక్కినేని నాగేశ్వరరావు మనవడు. నాగార్జున పెద్ద కొడుకు అంటూ సరదాగా మాట్లాడారు. నాన్నగారు ఏ సినిమాలు చేసినా అందులో లేడీ క్యారక్టర్స్ చాలా బలంగా ఉండటానికి ఇష్టపడే వారనీ.... ఆ వారసత్వాన్ని చైతు తీసుకున్నాడని తెలిపారు. రమ్యకృష్ణ నేను కలిసి చాలా చిత్రాలు చేశాం. అన్ని పెద్ద హిట్స్ . ఇప్పుడు తను చైతుకు అత్తయ్య అయింది. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ తెలియని వారు లేరు. నాతో అల్లరి అల్లుడు సినిమాలో చిన్న పాత్రాలో నటించింది. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడులో అత్త పాత్రలో చైతుతో నటించింది. కచ్చితంగా ఆ సినిమాలా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నేచరల్ స్టార్ నాని కూడా పాల్గొన్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చారు. అను ఇమ్మాన్యుయెల్ హీరయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది.