బాలీవుడ్ 'పోలీస్'గా షారుక్?
on Aug 7, 2020
తమిళ దర్శకుడు అట్లీకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఛాన్స్ ఇచ్చాడనేది ఇప్పటిమాట కాదు. గత ఏడాది చెన్నైలో కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు దర్శకుడి ఆఫీసుకి షారుక్ వెళ్ళాడు. తరవాత ముంబైలో వీరిద్దరూ కలిశారు. అయితే, కొత్త సినిమా కబురు ఏదీ చెప్పలేదు.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... విజయ్ హీరోగా అట్లీ తీసిన తమిళ సినిమాల్లో 'తెరి' ఒకటి. తెలుగులో 'పోలీస్'గా విడుదలైంది. మొదట 'పోలీసోడు' అని టైటిల్ పెట్టారు. పోలీస్ శాఖ నుండి అభ్యంతరాలు రావడంతో టైటిల్ మార్చారు. ఇప్పుడీ సినిమాను హిందీలో షారుక్‌తో అట్లీ రీమేక్ చేయనున్నాడని చెన్నై టాక్. హీరోకి స్టోరీ సినాప్సిస్ సెండ్ చేశాడట. అయితే, షారుక్ నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ దర్శకులతో పాటు చాలామంది బాలీవుడ్ బాద్షాకి కథలు చెప్పారు. సుమారు 18మంది లైనులో ఉన్నారు. అట్లీ కథ కంటే మరో కథ ఆసక్తిగా షారుక్‌కి ఆసక్తిగా అనిపిస్తే అట్లీకి అవకాశం ఉండకపోవచ్చు.