బోయపాటి సినిమాకు ఫిజిక్స్ పనిచేయదు..!
on Apr 22, 2016
సరైనోడు సినిమా రివ్యూలు, టాక్ లు ఒకసారి పక్కన పెడదాం. కానీ మీరు సినిమాకు వెళ్లాలనుకునేప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. డైరెక్ట్రర్ బోయపాటి సినిమా అని తెలిసి మీరు వెళ్లాలనుకుంటే ముందు ఫిజిక్స్ గురించి మీకు తెలిసినవన్నీ మర్చిపోండి. గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉందని కూడా బోయపాటికి తెలీదు.(బహుశా తెలిసినా పట్టించుకోరు కాబోలు..) ఇక న్యూటన్స్ థర్డ్ లా..అదేనండీ, ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుంది అనేది మాత్రం ఆయన కరెక్ట్ గా ఫాలో అవుతాడు. దెబ్బకు డబుల్ దెబ్బ తీయందే, ఆయన సినిమాల్లో హీరో అన్నం తినడు. ఈరోజే రిలీజైన బన్నీ బోయపాటి ల సరైనోడుకు వెళ్లేముందు ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకోండి. అంతేకాదు, ఇన్నాళ్లూ కామెడీ మీదో, సెంటిమెంట్ మీదో లాక్కొచ్చిన తెలుగు సినిమాల్ని మీరు చూసి ఉంటారు. కానీ కేవలం ఫైట్స్ ఆధారంగా సినిమాను డిజైన్ చేశారు బోయపాటి. ఆల్రెడీ ఆయన గత సినిమాలన్నీ దాదాపు సూత్రం మీద రన్ అయ్యాయి కాబట్టి ఇదేమీ కొత్త న్యూస్ కాకపోయినా, ఈసారైనా బోయపాటి ఫిజిక్స్ ను గౌరవించి ఉంటాడు అన్న ఒపీనియన్ తో మాత్రం వెళ్లకండి. ఒకటి మాత్రం చెప్పచ్చు. మాస్ పల్స్ బోయపాటికి బాగా దొరికేసింది. బి, సీ సెంటర్లలో జనాలు విజిల్స్ తో ఊదరగొట్టేలా సీన్స్ ఉంటాయి. కానీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రం, డిష్యుం డిష్యుంకి కాస్త ప్రిపేర్ అయి వెళ్తే, హ్యాపీగా చూసి వచ్చేయచ్చు. బన్నీ ఫ్యాన్స్ కు మాత్రం సరైనోడు బాగా నచ్చే సినిమా అవుతుందని టాక్.
Also Read