మహేష్ సినిమాలో విజయ్ మాల్యా టైప్ విలన్?
on Jun 2, 2020
మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'సర్కారు వారి పాట'. బ్యాంక్ స్కామ్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని కృష్ణా నగర్ టాక్. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ విజయ్ మాల్యా టైపులో ఉంటుందట.
భారతీయులకు విజయ్ మాల్యా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు విలాసవంతమైన జీవితానికి చిరునామాగా ఆయన్ని చూపించేవారు. రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ ఐపీఎల్ టీమ్, కింగ్ ఫిషర్ క్యాలెండర్ షూట్స్ గట్రా గుర్తొచ్చేవి. ఇప్పుడు బ్యాంకులకు ఎగ్గొట్టిన లోన్లు గుర్తొస్తున్నాయి. వైట్ కాలర్ క్రిమినల్స్ జాబితాలో విజయ్ మాల్యాను చేర్చారు. ఫారిన్ కంట్రీస్ నుండి అతని ఇండియాకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
'సర్కారు వారి పాట' సినిమాలో ఇండియాలో బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టి ఫారిన్ పారిపోయిన వైట్ కాలర్ క్రిమినల్ ను హీరో మళ్లీ ఇండియా ఎలా తీసుకొచ్చాడు అనేది కథ అట. అందుకోసమే మహేష్ మెడపై రూపాయి బిళ్ళను టాటూగా వేశారట.