English | Telugu

స‌ర్కార్ మూవీ రివ్యూ

on Nov 6, 2018

         

న‌టీన‌టులు: విజ‌య్, కీర్తి సురేష్‌,  రాధా ర‌వి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: మురుగ‌దాస్‌
నిర్మాత: క‌ళానిధి మార‌న్‌
సంగీతం: ఏ ఆర్ ర‌హ‌మాన్‌
ఎడిట‌ర్: శ్రీక‌ర్ ప్ర‌సాద్

విజ‌య్‌, మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి చిత్రాలు ఘన విజ‌యం సాధించాయి. తుపాకి చిత్రం తెలుగులో కూడా బాగానే ఆడింది. తాజాగా వీర‌ద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `స‌ర్కార్` సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. విడుద‌ల‌కు ముందు ఈ సినిమా క‌థ విష‌యంలో కొన్ని కాంట్ర‌వ‌ర్సీలు కూడా అయ్యాయి. అందులో విజ‌య్ మెర్సల్ లాంటి స‌క్సెస్ ఫుల్ సినిమా త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో స‌ర్కార్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి  దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఏ మేర‌కు ఆకట్టుకుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం....
 

కథ:

వ‌రల్డ్ లోనే నెంబ‌ర్ వ‌న్ కంపెనీ అయిన ఓ ప్రైవేట్ కంపెనీ సిఈవో అయిన సుంద‌ర్ రామ‌స్వామి ( విజ‌య్‌) ఓటుకి ఎంతో విలువ‌నిచ్చే వ్య‌క్తి. ఈ  క్ర‌మంలో త‌న ఓటు వినియోగించుకోవ‌డానికి త‌న సొంత రాష్ట్ర‌మైన ఏపీకి ఎల‌క్ష‌న్స్ జ‌రుగుతున్న క్ర‌మంలో వ‌స్తాడు.  కానీ, అప్ప‌టికే త‌న ఓటును ఎవ‌రో వేసేస్తారు. ఇలా దొంగోటు ఎవ‌రో వేయ‌డంతో ఈ విష‌యం పై సుంద‌ర్ రామ‌స్వామి కోర్టుకు వెళ‌తాడు.  త‌న ఓటు సంగ‌తి తేలే వ‌ర‌కు ఎన్నిక‌లు ఫ‌లితాలు వాయిదా వేసేలా చేస్తాడు.  ఆ త‌ర్వాత జ‌రిగే కొన్ని ప‌రిణామాల‌తో ఆ ఎన్నిక‌లు ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ జ‌ర‌పాల‌ని కోర్టు తీర్పునిస్తుంది.  ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?  ఓటు హ‌క్కు పై ప్ర‌జ‌ల్లో ఎలాంటి అవ‌గాహ‌న క‌ల్పించాడు సుంద‌ర్ రామ‌స్వామి . చివ‌రకు సుంద‌ర్ రామ‌స్వామి త‌ను అనుకున్న‌ది సాధించాడా?  లేదా అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

విశేష‌ణ‌లోకి వెళితే..

తెలుగు  ప్రేక్ష‌కుల‌కు తెలిసిన ఆర్టిస్టులు అంత‌గా లేక‌పోవ‌డంతో సినిమాలో త‌మిళ వాస‌న ఎక్కువ‌గా వ‌స్తుంది. వ‌ర‌ల‌క్ష్మి , విజ‌య్ కి మధ్య వ‌చ్చే కొన్ని సీన్స్ కొన్ని అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు. క్లైమాక్స్ సింపుల్ గా తేల్చేయ‌డం సినిమాకు మైన‌స్ గా అనిపిస్తుంది. సిన‌మాలో పొలిటిక‌ల్ ప‌రంగా క‌నెక్ట‌య్యే అయ్యే అంశాలు కొన్ని ఉ న్న‌ప్ప‌టికీ సినిమాను పూర్తిగా విజ‌య్ ఫ్యాన్స్ కి న‌చ్చేలా ఎలివేట్ చేసిన‌ట్టు అనిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్:
 విజ‌య్
 వ‌రల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్
  ఫ‌స్టాప్
 యాక్ష‌న్ ఎపిసోడ్స్
 
 మైన‌స్ పాయింట్స్:  
 రియ‌లిస్టిక్ గా లేని స‌న్నివేశాలు
 సెకండాఫ్‌
  క్లైమాక్స్ సింపుల్ గా ముగించ‌డం
  పాట‌లు
  తెలుగు ప్రేక్ష‌కుల‌ను తె లియ‌ని యాక్ట‌ర్స్

 న‌టీన‌ట‌లు హావభావాలు:

విజ‌య్ ఓ ఫేమ‌స్ కంపెనీ సీఈవో గా చాలా స్టైలిష్ గా క‌నిపించాడు. త‌న స్టైల్లో ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌న మార్క్ చూపించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్ లో పీక్స్ చూపించాడు.  హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టించింది.  త‌న పాత్ర కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా ఉన్నంతలో ఆక‌ట్టుకుంది. పొలిటిక‌ల్ పాత్ర‌లో  వ‌ర‌ల‌క్ష్మి  శ‌ర‌త్ కుమార్ ఎక్స్ లెంట్ ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచింది.  ఇక మిగిలిన పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా తెలిసిన‌వారు లేరు.

 సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

డైర‌క్ట‌ర్ ముర‌గ‌దాస్ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లైన్ ఎన్నుకుని త‌నదైన మార్క్ లో ప్ర‌జెంట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. లైన్ గా బాగున్న‌ప్ప‌టికీ స‌న్నివేశాల్లో స‌హ‌జ‌త్వం లోపించిండంతో విజ‌య్ ఫ్యాన్స్ కు మాత్ర‌మే క‌నెక్ట‌య్యేలా త‌యారైంది సినిమా.  పొలిటిక‌ల్ లీడ‌ర్స్ చేసే అవినీతి కార‌ణంగా అన్ని రంగాల‌పై ఆ ఎఫెక్ట్ ఎంత‌గా ప‌డుతుందో చెప్పే ప్ర‌య‌త్నం బావుంది.  సెకండాఫ్ లో క‌థ‌నం లోపించి సాగ‌దీసిన  ఫీలింగ్ క‌లుగుతుంది.లాజిక్ లెస్ కూడా అనిపిస్తుంది.  ఏఆర్ ర‌హ‌మాన్ సంగీతం అక్క‌డ‌క్క‌డా ఆకట్టుకుంది.  సినిమాటోగ్ర‌ఫీ,ఎడిటింగ్ ప‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

 సూటిగా చెప్పాలంటే:

స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రంలో ఆక‌ట్టుకునే అంశాలు మెండుగానే ఉన్న‌ప్ప‌టికీ ...వాటిని ఇంట్ర‌స్టింగ్ గా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కాలేక‌పోయాడు. అస‌హ‌త్వంతో కూడిన స‌న్నివేశాలు,  స్క్రీన్ ప్లే  అంత ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డంతో సినిమా గాడీ త‌ప్పింది.  దీంతో ఈ సినిమా విజ‌య్ ఫ్యాన్స్ కు మాత్ర‌మే న‌చ్చేలా త‌యారైంది. మ‌రి తెలుగులో  విజ‌య్ కు ఫ్యాన్స్ అంత‌గా లేరు. కాబ‌ట్టి ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్టవుతుందో చెప్ప‌లేం.

రేటింగ్ 2.25


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here