వ్వావ్.. మొదటి, రెండు స్థానాలూ 'సరిలేరు నీకెవ్వరు'వే!
on Jul 9, 2020
టెలివిజన్లో 2020 తొలి త్రైమాసికం (ఫస్ట్ క్వార్టర్)లో టాప్ రేటింగ్ పొందిన సినిమాలేవి? ఇప్పటికే టెలివిజన్లో అత్యధిక రేటింగ్ పొందిన సినిమా మహేశ్ హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రికార్డ్ సృష్టించిన విషయం మనకు తెలుసు. 'బాహుబలి: ద కన్క్లూజన్' 22.7 టీఆర్పీ రికార్డును బద్దలు కొట్టిన 'సరిలేరు నీకెవ్వరు' 23.4 టీఆర్పీ సాధించింది.
విశేషమేమంటే ఈ ఏడాది సెకండ్ హయ్యెస్ట్ టీఆర్పీ కూడా ఆ సినిమా పేరిటే నమోదు కావడం. అవును. రెండోసారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా 17.4 టీఆర్పీని సాధించింది. దాని తర్వాతే మిగతా సినిమాల టీఆర్పీలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా సెకండ్ టైమ్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో దీనిది రెండో స్థానం. మొదటి స్థానంలో 'ఫిదా' ఉంది. అది రెండోసారి ప్రసారమైనప్పుడు 18.6 టీఆర్పీ సాధించింది. 2020 జనవరి నుంచి మార్చి వరకు టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ టీఆర్పీ సాధించినవి ఏవంటే...
1. సరిలేరు నీకెవ్వరు - 23.4
2. సరిలేరు నీకెవ్వరు - 17.4
3. ప్రతిరోజూ పండగే - 15.13
4. సైరా.. నరసింహారెడ్డి - 11.8
5. నానీస్ గ్యాంగ్ లీడర్ - 8.66
6. వినయ విధేయ రామ - 8.16
7. రూలర్ - 7.5
8. విజిల్ (తమిళ డబ్బింగ్ ఫిల్మ్) - 6.86