హీరోయిన్ డ్రైవర్‌కు కరోనా.. ఆమె సేఫ్!
on Jul 14, 2020
బాలీవుడ్ రైజింగ్ హీరోయిన్ సారా అలీఖాన్ డ్రైవర్ టెస్టుల్లో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాడు. అయితే సారా, ఆమె కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బంది నెగటివ్‌గా తేలడం ఊరట. ఈ విషయాన్ని సోమవారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది సారా. తన కారు డ్రైవర్ బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడని తెలిపింది.
"మా డ్రైవర్‌కు టెస్ట్‌లో కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని మీకు చెప్పదలచుకున్నాను. ఈ విషయంపై బీఎంసీ తగిన విధంగా అప్రమత్తం చేసింది. అతను ఒక క్వారంటైన్ సెంటర్లో చేరాడు. మా కుటుంబం, ఇంట్లోని ఇతర సిబ్బంది, నేను టెస్టులు చేయించుకున్నాం. అందరికీ నెగటివ్‌గా వచ్చింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. బీఎంసీ అందిస్తోన్న సాయానికీ, సూచనలకూ నా తరపునా, నా కుటుంబం తరపునా సిన్సియర్‌గా థాంక్ చెప్తున్నా. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి" అని ఆమె రాసుకొచ్చింది. పని విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ జోడీగా 'కూలీ నం.1' మూవీ చేస్తోంది.