మామా మజాకా అంటోన్న సమంత!!
on Sep 21, 2018
నాగచైతన్యను మ్యారేజ్ చేసుకుని నటి సమంత అక్కినేనివారి కోడలైన విషయం మీకు తెలిసిందే. కాగా నాగార్జున , నాని నటించిన మల్టీస్టారర్ `దేవదాస్` చిత్రం మ్యూజిక్ పార్టీ అతిథిగా విచ్చేసిన సమంత మామ నాగార్జునాను ఉద్దేశించి మాట్లాడుతూ...మా మామా మాజాకా...సినిమాను చంపేస్తాడు`` అంటూ అందర్నీ నవ్వించింది. ఇంకా ఆమె చెబుతూ...సోగ్గాడే చిన్నినాయనా` చిత్రం తర్వాత మళ్లీ ఈ సినిమా పై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మామ. నానిగారు టెర్రిఫిక్ యాక్టర్. సాంగ్స్ బావున్నాయి. సినిమా యూనిట్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పుకొచ్చింది. సమంత నటించిన యూ టర్న్ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుంది.