చిరు రాకతో చిన్నపిల్లాడిలా గంతులేసిన నాగ్
on Nov 14, 2017
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ, మహారథులు హాజరై కొత్త జంటను విష్ చేశారు. వచ్చిన వారందరినీ నాగ్ పేరుపేరునా అప్యాయంగా పలకరిస్తున్నారు.. సరిగ్గా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అక్కడికి చేరుకున్నారు.. విషయం తెలుసుకున్న కింగ్ ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికి సంతోషంతో హగ్ చేసుకున్నారు. అప్పటి వరకు చై-సామ్లు మాత్రమే వచ్చిన వారితో ఫోటోలు దిగగా.. ఈ సారి ఏకంగా ఫ్యామిలీ మొత్తం చిరుతో గ్రూప్ ఫోటో దిగింది. మెగాస్టార్ ఉన్నంత సేపు నాగ్ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా కనిపించారు. దీంతో అక్కడికి వచ్చిన గెస్టులంతా అసలు చిరంజీవి అంటే నాగార్జునకు ఎందుకంత ఇష్టమని గుసగుసలాడుకుంటున్నారు.