English | Telugu

మా పెళ్లిలో అలాంటి పనులు చేయొద్దు ప్లీజ్!

on Oct 5, 2017

పెళ్లికి పిలిచింది ఓ వందమందినీ... వాళ్లకు కూడా షరతులు విధించేస్తోంది సమంత. ‘పెళ్లికి రావడం.. వధూవరులను దీవించడం.. గౌరవంగా వెళ్లిపోవడం అంతే... మా పెళ్లిని సెల్ ఫోన్ తో చిత్రీకరించొద్దు. నాకిష్టం లేదు’ అని కరాఖండీగా చెప్పేసిందట. ఎందుకు అలాగా? అనడిగితే... ‘మీదేముంది.. చక్కగా తీస్తారు. తీసి ఊరుకుంటారా? సోషల్ మీడియాలో పెడతారు. దాంతో అందరూ చూస్తారు. పెళ్లి అనేది మా వ్యక్తిగత వేడుక. మనసుకు దగ్గరైన వారిని మాత్రమే పిలిచింది అందుకే. దాన్ని అందరూ చూడ్డం నాకిష్టం లేదు’ అని చెప్పేసిందట. 

అయితే.. వచ్చిన అతిథులకు ఓ వెసులుబాటు మాత్రం ఇచ్చింది సమంత. ‘వీడియో తీయొద్దు కానీ... ఫొటోలు తీసుకోండి.. ఫర్లేదు’ అనిందట. ‘ఇంకా అక్కినేనివారి కోడలు అవ్వనేలేదు... అప్పుడే సాగించడం మొదలుపెట్టావే..’ అంటూ సమంతను ఆటపట్టిస్తున్నారట అక్కడ రానా లాంటి వాళ్లు. 

అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, సమంత కుటుంబం, ఇంకా సమంత, నాగచైతన్య ఫ్రెండ్స్... వీళ్లందరూ కలిసి ఓ రెండొందల మంది దాకా ఈ వేడుకకు హాజరవుతున్నారు. వీరందరి ప్రయాణ ఖర్చులతో పాటు అకామిడేషన్ కి  అయ్యే ఖర్చులూ కూడా చైతూ, సమంతానే భరిస్తున్నారని తెలిసింది. 6న హిందూ సంప్రదాయంలో, 7న క్రిస్టియన్ పద్ధతిలో... రెండు రోజులు జరిగే ఈ వేడుకకు 10 కోట్లు దాకా ఖర్చు అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here