సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాల్సిందే!
on May 29, 2020
పూజా హెగ్డే పేరు చెబితే సమంత అభిమానులు తోక తొక్కిన తాచులా అంతెత్తున పైకి లేస్తున్నారు. పూజాపై బుసలు కొడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్న డిమాండ్ ఒక్కటే... ‘సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాల్సిందే’ అని! వాళ్లు ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అసలు, ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే....
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని బుధవారం రాత్రి పూజా హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. హ్యాకర్స్ ఏవో పోస్టులు పెట్టారని, ఏవేవో మెసేజ్‌లు చేశారని ఆమె తెలిపారు. బుధవారం రాత్రి పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్‌లో ‘మజిలీ’ సినిమాలో ఫొటో పోస్ట్ చేసి ‘తను నాకు ఏమాత్రం అందంగా అనిపించడం లేదు’ అని ఉంది. ఇది సమంత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. పూజా హెగ్డే అకౌంట్ హ్యాక్ కాలేదని, కావాలనే ఆమె సమంతపై అక్కసు వెళ్లగక్కిందని అభిమానులు అంటున్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ‘టీమ్ సమంత’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. సమంతకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. సమంత అభిమానుల డిమాండ్ పట్ల పూజా హెగ్డే స్పందిస్తారో? లేదో? చూడాలి.
సమంత స్నేహితురాలు, గాయని–డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సైతం ‘టీమ్ సమంత’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేయడం గమనార్హం. వివాదం గురించి ఆమె స్పందించలేదు. కానీ, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయర్ల సంఖ్య పది మిలియన్లకు చేరిన సందర్భంగా పది స్వచ్ఛంద సంస్థలకు సమంత విరాళం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.
Also Read