బర్త్‌డే స్పెషల్.. చైతూ కోసం 'లవ్ స్టోరి' పోస్టర్ రిలీజ్ చేసిన సామ్!
on Nov 23, 2020
సోమవారం భర్త నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా అతను నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ లవ్ స్టోరి స్పెషల్ పోస్టర్‌ను సమంత అక్కినేని ఆవిష్కరించారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె ఎప్పటికీ చైతన్య సంతోషంగా ఉండాలని విష్ చేశారు.
“Always living life on your own terms @chay_akkineni. Wishing you only happiness always and forever (sic).” అని ఆమె రాసుకొచ్చారు. పోస్టర్‌లో చైతన్య లుంగీ, బనియన్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయిపల్లవి, నిర్మాతలు కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్‌రావు కూడా చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'లవ్ స్టోరి' మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. థియేటర్ల పరిస్థితి మెరుగయ్యాక సినిమాను విడుదల చేయనున్నారు. ఓ ఆహ్లాదకర ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే.. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు లుక్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
దర్శకుడు శేఖర్ కమ్ముల విషెస్ చెబుతూ.. ''కొన్ని స్నేహాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. చైతూతో అసోసియేషన్ అలాంటి సంతోషాన్నే ఇస్తుంది. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అని ట్వీట్ చేశారు.
రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న 'లవ్ స్టోరి' చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు, నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ రావు, రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
