ENGLISH | TELUGU  

అక్కినేని ఫ్లాపులకు సమంత కారణమా?

on Sep 14, 2018

 

పెళ్లి తరవాత సమంతకు బాగా కలిసొచ్చింది! అక్కినేని కోడలు అయ్యాక... ఆమె ఖాతాలో మంచి మంచి హిట్లు పడ్డాయి. వాటిలో ఆమెకు మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. ‘రంగస్థలం’, ‘మహానటి’, లేటెస్ట్‌ ‘యూ టర్న్‌’ సినిమాల్లో సమంత నటనకు మంచి పేరొచ్చింది. నాగచైతన్య హ్యాండ్‌ సమంతకు కలిసొచ్చిందనే చెప్పాలి. సమంత హ్యాండ్‌ మాత్రం అక్కినేని హీరోలకు కలిసొచ్చినట్టు లేదు. సమంత పెళ్లి తరవాత విడుదలైన అక్కినేని సినిమాలేవీ అంతగా ఆడలేదు. గతేడాది అక్టోబర్‌ 6న హిందూ సంప్రదాయంలో, 7న క్రైస్తవ సంప్రదాయంలో అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహాం రెండుసార్లు జరిగింది.

 

పెళ్లైన వారం రోజులకు నాగార్జున నటించిన ‘రాజుగారి గది 2’ విడుదలైంది. అందులో సమంత ప్రధాన పాత్ర పోషించారు. కోడలు పిల్ల వచ్చిన వేళా విశేషం బావుందని, సినిమా హిట్టని నాగార్జున ప్రకటించేశారు. సమంత కూడా సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. కానీ, ‘రాజుగారి గది 2’  హిట్టయ్యిందో? ఫ్లాపయ్యిందో? ఏవరేజ్‌ సినిమాగా నిలిచిందో? అందరికీ తెలిసిందే. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరిది అఖిల్‌ అక్కినేని నటించిన ‘హలో’ డిసెంబర్‌లో విడుదలైంది. అదీ అనుకున్నంతగా ఆడలేదు. ఇక, నాగార్జున చాలా రోజుల తరవాత యాక్షన్‌ హీరోగా నటించిన ‘ఆఫీసర్‌’ అయితే భారీ డిజాస్టర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

 

పెళ్లి అయిన ఆల్మోస్ట్‌ యేడాది తరవాత నాగచైతన్య సినిమా విడుదలైంది. అదే ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాక్‌ బాలేదు. పెళ్లికి కొన్ని రోజుల ముందు వచ్చిన నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ కూడా ఫ్లాపే. దీంతో అక్కినేని ఇంట సమంత అడుగుపెట్టిన తరవాత ఆ ఇంట హీరోలకు కలిసిరావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ వైఫల్యాలకు అనుష్కా శర్మను టార్గెట్‌ చేసినట్టు... అక్కినేని హీరోల ఫ్లాపులకు సమంతను టార్గెట్‌ చేయడం ఎంతవరకూ సమంజసం?? ఓ సినిమా హిట్టు ఫ్లాపు అనేది సమష్టి కృషికి నిర్వచనం. ఆ సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని సమంత ఎలా కారణం అవుతుంది?? ఆలోచిస్తే ఆన్సర్‌ దొరికినట్టే!!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.