మాల్దీవుల్లో జోరుగా, హుషారుగా.. చై-సామ్!
on Nov 22, 2020
నవంబర్ 23 నాగచైతన్య బర్త్‌డే. అయితే ఆ సమయానికి హైదరాబాద్‌లో అతను ఉండట్లేదు. కారణం.. ఇప్పటికే అతను భార్య సమంతతో కలిసి ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లడం. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలందరూ వరుసబెట్టి మాల్దీవుల్లో సెలవుల్ని ఆస్వాదించడానికి వెళ్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, మెహ్రీన్ పిర్జాదా, టైగర్ ష్రాఫ్, దిశా పటాని, నేహా ధూపియా తదితరులంతా అక్కడకు వెళ్లినవాళ్లే. తాజాగా ఆ లిస్ట్‌లో చై-సామ్ కూడా చేరారు. కరోనా మహమ్మారి దెబ్బకు కొన్ని నెలల పాటు టూరిజంను నిలిపివేసిన మాల్దీవులు తిరిగి దాన్ని పునరుద్ధరించగానే అక్కడి అందాలను, నీలి సముద్రాన్ని, బీచ్‌లను ఆస్వాదించడానికి అనేకమంది బారులు తీరుతున్నారు.
ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆ దీవుల నుంచి కొన్ని పిక్చర్లను షేర్ చేశారు సమంత అక్కినేని. ఒక ఫొటోలో ఆమె సముద్రం వంక చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. వెనుక నుంచి ఆ ఫొటో తీశారు. ఆమె డ్రస్ చూస్తే.. బికినీ పైన ఫ్లోరల్ మాక్సీ డ్రెస్ వేసుకున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో పాటు తలకు హ్యాట్ ధరించారు. కొబ్బరిచెట్టు, గ్రీన్ హార్ట్ ఎమోజీలను జోడించారు. ఇంకో ఫొటోలో సముద్రం లోపలకు వెళ్లడానికి సూట్ ధరిస్తున్నారు. దానికి "Into the sea.. @kreshabajaj I finally did it "అనే క్యాప్షన్ పెట్టారు.
ఈ పిక్చర్స్‌తో పాటు ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక టైమ్-లాప్స్ వీడియో పోస్ట్ చేశారు. అందులో రెండు పాస్‌పోర్టులతో పాటు మాల్దీవుల్లో వాళ్లెలా ల్యాండ్ అయ్యారో కనిపిస్తోంది. అయితే ఫొటోల్లో నాగచైతన్య మాత్రం కనిపించడం లేదు. ఈ పిక్చర్స్‌ను తీసింది అతనే అని ఊహించవచ్చు.
Also Read