అక్కినేని ఫ్యామిలీలో సమంత పాపులారిటీకి ఎదురే లేదు! నిదర్శనం ఇదే!!
on Sep 16, 2020
పెళ్లయ్యాక సమంత అక్కినేని పాపులారిటీ మరింతగా పెరిగిపోతూ వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య 12 మిలియన్ల మార్క్ దాటడం అందుకు నిదర్శనం. ఓ బేబీ యాక్ట్రెస్ సోషల్ మీడియాలో మొదట్నించీ చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. తరచూ తనకు, తన భర్త నాగచైతన్యకు సంబంధించిన పిక్చర్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆనందం పంచుతున్నారు. ఆఖరుకి తన పెట్ పప్పీ హ్యాష్ అప్డేట్స్ కూడా ఆమె అందిస్తుంటారు.
దశాబ్దం పైగా సినిమా కెరీర్‌ను ఆస్వాదిస్తోన్న ఆమె మూడేళ్లుగా సెలబ్రిటీ వైఫ్‌గా కూడా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. దక్షిణాది చిత్రసీమలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో ఒకరిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 12 మిలియన్ ఫాలోయర్ల మార్క్‌ను అందుకున్న సందర్భంగా ఒక స్టన్నింగ్ స్టిల్‌ను షేర్ చేశారు. "12 million Now and forever. Thankyou for this amazing shot @vaishnavpraveen (sic)." అనే కాప్షన్ పెట్టారు. క్లోజప్ షాట్లో ఇంటెన్స్ లుక్‌తో ఆ పిక్చర్లో సమంత మెస్మరైజ్ చేస్తున్నారు.
ఆ తర్వాత అదే డ్రస్‌లో ఫుల్ సైజ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. అందులో ఆమె కళ్లు మూసుకొని తమకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ పిక్చర్లకు మిలియన్ పైగా లైక్స్ రావడం ఆమె పాపులారిటీ ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది.
Also Read