సమంతకు నచ్చింది కానీ...
on Oct 19, 2018
‘ఏ మాయ చేసావె’లో సమంత హీరోయిన్, నాగచైతన్య హీరో. ఇదే సినిమా కథతో తమిళంలో శింబు హీరోగా, త్రిష హీరోయిన్గా ‘విన్నైతాండి వురువాయ’ టైటిల్‌తో దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. రెండు సినిమాలు విజయాలు సాధించాయి. తమిళంలో త్రిష చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో సమంత చేశారు. ‘దూకుడు’లో సమంత హీరోయిన్. ఈ సినిమా కన్నడ రీమేక్ ‘పవర్’లో త్రిష హీరోయిన్. తెలుగులో సమంత చేసిన క్యారెక్టర్‌ను కన్నడలో త్రిష చేశారు. రెండు సినిమాలు విజయాలు సాధించాయి. ఓ భాషలో త్రిష, మరో భాషలో సమంత... ఎవరు ఏ సినిమా రీమేక్‌లో నటించినా విజయాలు వచ్చాయి. అదే కోవలో తమిళంలో ఘన విజయం సాధించిన ‘96’ తెలుగు రీమేక్ చేరుతుందని ఆశించారు. కానీ, అటువంటిది ఏం లేదని సమంత తెలిపారు.
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా ‘96’. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలతో తమిళనాట విజయ కేతనం ఎగుర వేసింది. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజు ‘96’ రీమేక్ రైట్స్ కొన్నారు. తెలుగు రీమేక్‌లో నాని, సమంత జంటగా నటిస్తారని వార్తలు వచ్చాయి. ఇటీవల సినిమా చూసి త్రిష నటనను సమంత మెచ్చుకోవడంతో ఆమె సినిమాలో నటిస్తుందని అంతా భావించారు. సమంత సమాధానం మాత్రం వేరుగా వుంది. ట్విట్టర్లో ఒక అభిమాని ‘మీరు ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నార్ట! నిజమేనా?’ అని అడిగితే... ‘‘ఆ క్యారెక్టర్‌ను మళ్ళీ తెరకెక్కించకూడదు’’ అని జవాబు ఇచ్చారు. అంటే... సినిమా సమంతకు నచ్చింది కానీ తెలుగలో చేస్తే మాత్రం నటించరన్నమాట!!