డ్రగ్ కేసులో సారా ఉక్కిరిబిక్కిరి.. పట్టించుకోని తండ్రి సైఫ్ అలీఖాన్!
on Sep 29, 2020
సారా అలీఖాన్ డ్రగ్ కేసులో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతోంది. శనివారం ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంటరాగేట్ చేసింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుని డ్రగ్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ సారా పేరు వెల్లడి కావడంతో ఆమెకు సమన్లు జారీచేసి విచారించింది. కాగా ఈ కేసులో కూతురు సారాకు సహాయం చేయడానికి సైఫ్ అలీఖాన్ నిరాకరించాడంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
బాలీవుడ్ డ్రగ్ దర్యాప్తులో తన పేరు వెలుగులోకి వచ్చాక, ఎదురైన పరిణామాల్ని హ్యాండిల్ చేయడానికి సారా ఇంక ఏమాత్రమూ తండ్రి మీద ఆధారపడే స్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో సారాకు సాయం చేయడానికి సైఫ్ ఆసక్తి చూపడం లేదు. ఆఖరుకి మాజీ భార్య, సారా తల్లి అమృతా సింగ్ చేసిన అభ్యర్థనను కూడా సైఫ్ పెడచెవిన పెట్టాడని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలియజేసింది.
పైగా, గర్భవతిగా ఉన్న భార్య కరీనా కపూర్, కొడుకు తైమూర్ అలీఖాన్‌ను వెంటపెట్టుకొని ఢిల్లీ వెళ్లిపోయాడంట. అక్కడ కరీనా హీరోయిన్గా నటిస్తోన్న ఆమిర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చడ్ఢా' షూటింగ్ జరుగుతోంది. అయితే సారా నాయనమ్మ షర్మిలా ఠాగూర్ మాత్రం మనవరాలికి ఈ విషయంలో హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తోందట.
Also Read