శ్రియ పాత్రలో సాయిపల్లవి?
on May 12, 2021
మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. త్వరలో ఈ డాన్సింగ్ సెన్సేషన్ హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టబోతోందట. అది కూడా.. ఓ రీమేక్ తో.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ డ్రామా `ఛత్రపతి` హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ కూడా హిందీనాట తొలి అడుగేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. కాగా, మాతృకలో అందాల తార శ్రియ పోషించిన పాత్రలో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ కథలో కీలకమైన పాత్ర కావడం.. పాటల్లో డాన్సులకు స్కోప్ ఉండడంతో.. సాయిపల్లవి అయితేనే బాగుంటుందని వినాయక్ అండ్ టీమ్ భావిస్తోందట. మరి.. ఈ రీమేక్ కి `ఫిదా` పోరి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. సాయిపల్లవి నాయికగా నటించిన `లవ్ స్టోరి`, `విరాటపర్వం` చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ దశలో ఉంది.