సాయిపల్లవి vs సాయిపల్లవి
on Dec 17, 2018
కథానాయిక సాయిపల్లవికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. తన ప్రమేయం లేకుండానే తనతో తాను పోటీకి సాయిపల్లవి సిద్ధపడింది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు'లో సాయిపల్లవి కథానాయిక. ఈ నెల 21న అనగా... శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ అనువాద సినిమా 'మారి 2'లోనూ కథానాయిక పాత్రలో సాయిపల్లవి నటించింది. రెండూ ఒకే రోజు విడుదల కానుండటంతో రెండింటినీ ప్రమోట్ చేయవలసిన బాధ్యత ఆమెపై పడింది. ఒకటి 'పడి పడి లేచె మనసు'... తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కిన ప్రేమకథా చిత్రం . ఇంకొకటి 'మారి 2'... తమిళ నేటివిటీ ఎక్కువ కనిపించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాకు సీక్వెల్ ల్గా వస్తున్న సినిమా. రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించింది. ఏ సినిమానూ సాయిపల్లవి పక్కన పెట్టలేదు. ఇటు ప్రచారంలోనూ... అటు థియేటర్లలోనూ... సాయిపల్లవితో సాయిపల్లవి పోటీ పడటం ఖాయమే. ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి!!