తేజ్ ఐ లవ్ యు టీజర్ రివ్యూ
on May 1, 2018
మాస్ ఇమేజ్ కోసం కొన్ని మాస్ మసాలా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఒక కూల్ రొమాంటిక్ సినిమా తేజ్ ఐ లవ్ యు చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఇంప్రెస్స్ చేసిన తేజ్, ఈ రోజు టీజర్ తో ముందుకొచ్చాడు. ఇక టీజర్ విషయానికి వస్తే, వర్షం వస్తుండగా బస్సు స్టాప్ లో నిలుచుని టీ తాగుతున్న తేజ్ కి పక్కనే, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గిటార్ వాయిస్తూ కనిపిస్తుంది. వెంటనే, కళ్ళు మూసుకొని డ్రీం లోకి వెళ్ళిపోతాడు. టీ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ టీ షర్ట్ లోంచి అనుపమ ప్రత్యక్షమవుతుంది. ఆ సంతోషంలో, తేజ్ అమ్మాయికి టీ తాగిస్తూ హత్తుకుంటున్న సమయంలో కార్ హార్న్ సౌండ్ తో మళ్ళీ ఈ ప్రపంచానికి వస్తాడు. చూస్తే, అమ్మాయితో పాటు, చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండరు. ఇలా ముగిసిన టీజర్ ఫన్నీ గా ఉంది. కరుణాకరన్ మార్క్ రొమాంటిక్ కామెడీ గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ తో పాటు గోపి సుందర్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. వెటరన్ ప్రొడ్యూసర్ KS రామ రావు నిర్మాణంలో వస్తున్న తేజ్ ఐ లవ్ యు వర్షాకాలంలో ప్రేక్షకుల్ని సందడి చేయనుంది. చూద్దాం తేజ్ కి ఈ సినిమా సరయిన బ్రేక్ ఇస్తుందో లేదో!