సాయిధరమ్ తేజ్ ఏమయ్యాడు...?
on Feb 2, 2018
విన్నర్, జవాన్ సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్టు అవసరం పడింది. పోటీలో నిలబడాలంటే హిట్ కంపల్సరీ.. దీనిని త్వరగానే గ్రహించిన సాయి.. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన వివి వినాయక్‌తో కలిసి ఇంటిలిజెంట్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమాలో కంటెంట్ ఎంత ఉందన్న సంగతి పక్కనబెడితే.. ప్రేక్షకుడిని సినిమా దాకా తీసుకువచ్చేది పబ్లిసిటీనే. ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న దర్శకనిర్మాతలు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళుతున్నారు. అయితే ఇంటిలిజెంట్ విషయానికి వచ్చే సరికి ప్రమోషన్ లోపం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రమోషన్‌ను ముందుండి నడిపించాల్సిన హీరో సాయిథరమ్ తేజ్ అసలు పత్తా లేకుండాపోయాడు. టీజర్ రిలీజ్ రోజున బాలయ్య బాబుతో.. సాంగ్ లాంచ్ నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కనిపించిన సాయి ఆ తర్వాత కంటికే కరువైపోయాడు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారట.. ప్రమోషన్ సంగతి చూసుకోవాల్సిందిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కోరారట. వారి విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన లావణ్య... తన అందాలకు పని చెప్పింది. ప్రమోషనల్ వీడియోస్‌లో హాట్ హాట్‌గా కనిపిస్తోంది. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లోనూ నడుము అందాలను ప్రదర్శిస్తూ.. యూత్‌ను రెచ్చగొడుతోంది. లావణ్య ఈ రేంజ్లో స్కిన్ షో చేస్తోంది ఇంటిలిజెంట్ కోసమా..? లేక కెరీర్‌కి మంచి బూస్ట్ ఇవ్వడానికా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.