ఈ సంస్కారం పవన్ నుంచి నేర్చుకున్నాడా..?
on Nov 22, 2017
అచ్చుగుద్దినట్లు మెగాస్టార్ చిరంజీవి పోలికలతో ఉన్నాడంటూ సాయి థరమ్ తేజ్‌ని సుప్రీంగా పిలుచుకుంటూ ఉంటారు మెగా అభిమానులు. అలాగే నీలో ముగ్గురు మావయ్యల పోలికలు ఉన్నాయని స్నేహితులు అన్నప్పుడు భలే గర్వంగా ఉంటుందని ఎన్నో సందర్భాల్లో సాయి చెప్పుకొచ్చాడు. ముగ్గురు మావయ్యల్లో చినమావయ్య పవన్ ప్రభావం తనపై చాలా ఎక్కువని ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు. రీసెంట్గా తేజు నటించిన జవాన్ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంటోలో పవర్‌స్టార్‌ను ఆకాశానికెత్తేశాడు. నాకు ధైర్యంగా ఉండటం నేర్పించి.. నన్నొక జవానుగా తయారు చేసింది పవన్ కళ్యాణ్‌గారు. అయితే నేను ఇవాళ స్టేజ్ మీద నిలబడటానికి కారణం మా ముగ్గురు మావయ్యలు అని వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇటీవల గచ్చిబౌలిలో జరుగుతున్న తన చిత్ర షూటింగ్ సెట్‌కు వచ్చిన ఓ అభిమానితో సాయి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అంతగా అందులో ఏముందా అనుకుంటున్నారా.. ఒక దివ్యాంగుడైన తన అభిమానితో ఫోటో దిగడం కోసం మోకాళ్లపై వంగి మరీ అతని కోరిక తీర్చాడు. అసలు ఇంతటి సంస్కారం ఎవరి వద్ద నుంచి వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.