English | Telugu

మెగా హీరోతో మారుతి!!

on Feb 9, 2019

 `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రం రిజ‌ల్ట్ త‌ర్వాత మారుతి కొంచెం నెమ్మ‌దించాడు.  ఇంత వ‌ర‌కు త‌న త‌దుప‌రి సినిమా ఏంట‌న్న‌ది చెప్ప‌లేదు.  `భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ` నానితో చేసి మంచి స‌క్సెస్ కొట్టిన మారుతి మ‌ళ్లీ త‌న‌తో సినిమా చేద్దామ‌నుకున్నాడు కానీ, నాని వ‌రుస సినిమాలు ఒప్పుకుని బిజీ బిజీగా ఉన్నాడు.  ఇక నానితో సినిమా చాలా లేట‌య్యేలా ఉంద‌నుకున్న మారుతి మెగా హీరోతో వెళ్దామ‌నుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఆ మెగా హీరో ఎవ‌రో కాదు...సాయిధ‌ర‌మ్ తేజ్‌. వ‌రుస ఫ్లాప్ ల‌తో విసిగిపోయిన ఈ సుప్రీమ్ హీరో ప్ర‌స్తుతం `చిత్ర‌ల‌హ‌రి` లో న‌టిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా పూర్తి కావొచ్చింది. అయితే ఈ సినిమా త‌ర్వాత మ‌రో రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు తేజ్‌. మ‌రి ఇటీవ‌ల మారుతి క‌థ ని కూడా ఓకే చేశాడు. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ముందు పెడ‌తాడ‌న్న‌ది తెలియాల్సి ఉంది. మారుతి మాత్రం స్క్రిప్టుతో స‌హా రెడీ గా ఉన్నాడ‌ట‌. అయితే తేజ్ త‌దుప‌రి సినిమా మారుతితోనే కావ‌చ్చు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here