ట్రైలర్ రివ్యూ: జవాన్
on Nov 23, 2017
సాయిథరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ జవాన్. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. మూవీకి మరింత హైప్ తెచ్చే ప్రయత్నంలో భాగంగా జవాన్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హీరో, హీరోయిన్లతో పాటు మూవీలో ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. దేశద్రోహులకు అడ్డుగా నిలుస్తూ దేశం కోసం.. కుటుంబం కోసం పోరాడే ఓ యువకుడి కథే ఈ జవాన్ అని అర్థమవుతోంది. లవ్.. యాక్షన్.. ఎమోషన్ సీన్స్‌ను టార్గెట్ చేస్తూ ఉన్న ఈ ట్రైలర్ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో కలిగించిందని చెప్పవచ్చు. డిసెంబర్ 1న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
Also Read