English | Telugu

సక్సెస్ కోసం ప్రయత్నమే 'చిత్రలహరి'

on Apr 10, 2019

 

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్  హీరో హీరోయిన్లుగా 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై వరుస సక్సెసఫుల్ చిత్రాల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ (సీవీమ్) నిర్మంచిన చిత్రం 'చిత్రలహరి'. టీజర్ తో  మంచి  రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ  చిత్రం. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఆడియోకి  అదిరిపోయా  రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పట్ల ఆడియన్స్ లో ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా ఈ నెల 12 న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా సాయి ధరమ్ తేజ్ మీడియా తో మాట్లాడారు.  

'చిత్రలహరి' కాన్సెప్ట్ గురించి వివరిస్తారా?
ఇందులో నా క్యారక్టర్ పేరు విజయ్ కృష్ణ. తన లైఫ్ ఎప్పుడూ సక్సెస్ అనేది చూడలేదు. సక్సెస్ అంటే ఏంటో కూడా తనకి సరిగా తెలియదు. అలాంటి ఒక యువకుడు అపజయాలు అధిగమించి ఎలా సక్సెస్ సాధించాడు... అన్నది సినిమా స్టోరీ.

స్టోరీస్ ఎంపిక లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ?
ప్రతి సినిమా విజయం వెనుక ఒక టీం వర్క్ ఉంటుందని నమ్ముతాను. అలాగే ప్రతి సినిమాకు హండ్రెడ్ పెర్సెంట్ యాక్టర్ గా పూర్తి ఎఫర్ట్ పెడతాను. ఆ ప్రాసెస్ లో కొన్ని ఫెయిల్యూర్స్ రావడం సహజం. కానీ నటుడిగా ప్రతి సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. కథ లో కంటెంట్ బావుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ప్రతి నటుడికి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఫ్రైడే ఒక అవకాశం ఉంటుందని నమ్ముతాను. స్క్రిప్ట్ పరంగా సంతృప్తి గా అనిపిస్తే దాన్ని ఓకే చేస్తున్నా.

కిశోర్ తిరుమల మీరు మంచి ఫ్రెండ్స్ అంట కదా?
అవును కిశోర్ నాకు రైటర్ ఉన్నప్పటి నుంచే నాకు బాగా తెల్సు. రామ్ తో సినిమా చేసినప్పుడు ఫోన్ చేసి అభినందించాను. కలిసి సినిమా చేయడానికి ఇప్పటికి కుదిరింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ గురించి చెప్పండి?
చాలా మంచి బ్యానర్. అభిరుచి గల ప్రొడ్యూసర్స్. వరుస ప్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరికి తెలిసిందే. ఎక్కడ రాజీ పడకుండా సినిమా నిర్మించారు .

దేవి శ్రీ తో, సునీల్ తో ఫస్ట్ టైం వర్క్ చేసినట్టున్నారు?
ఎప్పటి నుంచో దేవి శ్రీ తో వర్క్ చేయాలనుకుంటున్నా. అది ఈ సినిమా తో నెరవేరింది. అలాగే సునీల్ అన్నతో యాక్ట్ చేయాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరింది. సునీల్ క్యారక్టర్ ఫుల్ ఫన్ జనరేట్ చేసింది. కళ్యాణి, నివేదిత తో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైం ఇద్దరు మంచి పెరఫార్మెన్సు కనబరిచారు. ముగ్గురి మధ్య హేల్దీ కాంపిటీషన్ ఉంది. రెండు మూడు స్క్రిప్ట్స్ విన్నాను. త్వరలో నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ చెబుతా.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here