కమల్ హాసన్ అమెరికా షెడ్యూల్ పూర్తి!
on Jun 27, 2016
కమల్ హాసన్ టైటిల్ పాత్ర పోషించడంతోపాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "శభాష్ నాయుడు". కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో కమల్ తనయ శృతి హాసన్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయ్యింది. ఈ చిత్రానికి టి.కె.రాజీవన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. సరిగ్గా షూటింగ్ మొదలయ్యే టైమ్ కి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో కమల్ హాసనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
ఈ సినిమాలో అక్కినేని అమల కూడా ఓ ముఖ్యభూమిక పోషిస్తోంది. అలాగే కమల్ హాసన్ అసిస్టెంట్ గా బ్రహ్మానందం కనిపించనున్నాడు!