English | Telugu

రివ్యూలు... విమర్శలపై సుజీత్ సెటైర్స్

on Sep 6, 2019

 

'సాహో'కి మంచి రివ్యూలు రాలేదు... ఇది నిజం! సినిమాలో మేజర్ ట్విస్ట్, స్క్రీన్ ప్లేను ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్'ను గుర్తు చేసింది... ఇదీ నిజం! అయితే... ఈ నిజాలను ఒప్పుకోడానికి చిత్ర దర్శకుడు సుజీత్ సిద్ధంగా లేరు. తండ్రిని చంపిన వారిపై కొడుకు పగ తీర్చుకోవడం అనే కథతో తెలుగులో వందలాది చిత్రాలు వచ్చాయని అంటున్నారు. అంతటితో ఆగితే పర్వాలేదు. రివ్యూ రైటర్లు, సినిమాలో కామెంట్ చేసిన వాళ్ళపై సెటైర్లు వేస్తున్నారు. కామెంట్ చేసే వాళ్ళలో సగం మంది ఫ్రెంచ్ సినిమాను చూశారో లేదో అని సుజిత్ కామెంట్ చేశారు. 'లార్గో వించ్' సినిమా స్క్రీన్ ప్లే, తన సినిమా స్క్రీన్ ప్లే వేర్వేరని ఆయన అన్నారు.

సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని ఒప్పుకోవడానికి కూడా సుజిత్ మనసు అంగీకరిస్తున్నట్లు లేదు. 'సాహో' ఫస్ట్ ఆఫ్ మరింత బెటర్ గా ఉండాల్సింది అని, కొంత ట్రిమ్ చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. "అవకాశం వస్తే సినిమాలో మీరు ఏమైనా మార్పులు చేస్తారా?" అని తాజా ఇంటర్వ్యూలో సుజిత్ ను అడిగితే.. "సినిమా విడుదల తర్వాత అందులో సన్నివేశాలను కట్ చేసినా, ట్రిమ్ చేసిన సినిమా బాలేదు అని ఒప్పుకున్నట్టే" అని అన్నారు. రివ్యూలు కఠినంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రివ్యూలు వల్ల థియేటర్లోకి వచ్చే ప్రేక్షకులు ఆగిపోతున్నారని, పెద్ద సినిమాలకు రెండు మూడు రోజులు రివ్యూలు ఆపితే బాగుండని సుజిత్ అభిప్రాయపడ్డాడు. రివ్యూ రైటర్లు సినిమాను సినిమాలా కాకుండా పర్సనల్ గా చూశారని సుజిత్ అంటున్నాడు. ఈ మధ్యకాలంలో యువ దర్శకుల్లో చాలా మంది తొలి సినిమాకు మంచి రివ్యూలు వచ్చినప్పుడు సంతోషం వ్యక్తం చేశారు. మలి సినిమాకు రివ్యూలు సరిగ్గా రానప్పుడు ఇదే తరహా అభిప్రాయాలను వెలిబుచ్చారు. సుజిత్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here