12-12-12న ఆర్ ఆర్ ఆర్ మరో అప్డేట్!!
on Dec 1, 2018
11-11-11న రాజమౌళి మహా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్ ` ప్రారంభించి సంచలనం సృష్టించాడు. ఏది చేసినా ఒక ప్లానింగ్ తో చేసే రాజమౌళి మరో ఇంట్రస్టింగ్ డేట్‌న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇవ్వనున్నారు. అదే 12-12-12. అంటే డిసెంబర్ 12 న మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రాన్ని సంబంధించిన కీలకమైన విషయాలను వెల్లడించనున్నారని సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రంలోని హీరోయిన్స్ గురించి వెల్లడించలేదు. 12-12-12న హీరోయిన్స్ కు సంబంధించిన సమాచారంతో పాటు మరికొన్ని విషయాలను జక్కన్న వెల్లడిస్తారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించుకుంటోంది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.