ఉగాది కానుక.. ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో!
on Mar 24, 2020
ప్రస్తుతం తెలుగులో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించిన ఏ చిన్న వార్తయినా వైరల్ అయ్యే పరిస్థితి. అలాంటిది ఆ సినిమా టైటిల్ వస్తోందంటే.. అదెంత పెద్ద వార్త! ఎప్పడెప్పుడు ఈ సినిమా టైటిల్ వెల్లడవుతుందా అని ఆ సినిమా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఉగాది పర్వదినం సందర్భంగా టైటిల్ లోగోతో పాటు, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను ఐదు భాషల్లో.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో ఆవిష్కరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి, హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ ట్వీట్ చేశారు. మూవీ అఫియల్ ట్విట్టర్ అకౌంట్, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇదే విషయం తెలిపాయి. అయితే ఏ టైమ్‌లో ఆవిష్కరించేదీ ఇప్పుడే చెప్పలేమని వాళ్లు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. పరిస్థితులు కుదురుకున్నాక షూటింగ్ కొనసాగనున్నది. "ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి.. ఆన్లైన్లో ఉండండి.. థ్రిల్ అవ్వండి.. ప్రింట్లు, ఫ్లెక్సీలు వద్దు.. ఇది హంబుల్ రిక్వెస్ట్.. రేపు 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ వస్తోంది అని రాజమౌళి ట్వీట్ చేశాడు. దానికి కొనసాగింపుగా, నా మొత్తం టీమ్ తరపున అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ తమ ఇళ్లల్లో సౌకర్యంగా ఉండి దీన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక కారణంగా దేశమంతా లాక్డౌన్ అయి ఉంది, గుమిగూడటానికి కారణం అంటూ ఏమీ లేదు. ఇది ప్రపంచ సంక్షోభ కాలం. ప్రతి ఒక్కరి స్పిరిట్‌ను ఉద్దీపించడానికి మన వంతు పని చెయ్యాలని కోరుకుందాం. చాలా కాలంగా వేచిచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ టైటిల్ లోగోను రేపు మోషన్ పోస్టర్‌తో పాటు ఆవిష్కరిస్తున్నాం. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరు ఇంటి నుంచే పనిచేస్తుండటం వల్ల కచ్చితంగా ఫలానా టైమ్‌కు వస్తుందని ఇప్పుడు చెప్పలేను అని ఆయన రాసుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ సైతం "ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి.. ఈ సంక్షోభ కాలంలో మీ స్ఫూర్తిని ఉద్దీపించడానికి మా వైపు నుంచి రేపు 'ఆర్ఆర్ఆర్' మూవీ టైటిల్ లోగోను మోషన్ పోస్టర్‌తో పాటు ఆవిష్కరిస్తున్నాం. ఆన్లైన్లో ఉండండి. రేపటి 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్‌ను ఆస్వాదించండి" అని ట్వీట్ చేశాడు.
Also Read