English | Telugu

ఆర్ఆర్ఆర్‌... రిలీజ్ ఎప్పుడంటే?

on Mar 14, 2019

సందేహాలొద్దు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది జూలై నెలాఖరున 'ఆర్ఆర్ఆర్‌'ను విడుదల చేస్తామని రాజమౌళి అన్నారు. వాయిదా పడే సమస్య లేదన్నారు. 'బాహుబలి' సినిమా పలు వాయిదాలు పడింది. బహుశా... రాజమౌళి అది దృష్టిలో పెట్టుకున్నారేమో. "తప్పకుండా జూలై 30, 2020న 'ఆర్ఆర్ఆర్‌' విడుదల అవుతుంది. వెనక్కి వెళ్ళదు" అని చెప్పారు.  సినిమా విడుదల వచ్చే ఏడాది కనుక ఈ ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్ పుట్టినరోజులకు స్పెషల్ స‌ర్‌ప్రైజ్‌లు ఇవ్వడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. 'బాహుబలి' విజయాన్ని పక్కన పెట్టి... ఇదే తొలి సినిమా అనుకుని చేస్తున్నానని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "సినిమాలో కథంతా రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల చుట్టూ తిరుగుతుంది. హీరోలు, హీరోయిన్లు, విలన్లు వాళ్ళే. మిగతా క్యారెక్టర్స్ వాళ్లకు సపోర్టింగ్ గా ఉంటాయి. కథ రాసేటప్పుడు స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయా? లేవా? అని ఆలోచించలేదు. ప్రేక్షకులపై సన్నివేశాలు ఎలా ప్రభావితం చూపిస్తాయని మాత్రమే ఆలోచిస్తా. కథ డిమాండ్ చేస్తే స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ పెడతా. ఈ సినిమాలో అలియా భట్ క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటివరకూ మనం చూడని అల్లూరి, కొమరం కనిపిస్తారు. వాస్తవ పాత్రలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఫిక్షనల్ సినిమా ఇది. ప్రేక్షకులకు తెలియని కథ చెబుతున్నా" అని అన్నారు. సీక్వెల్ గురించి ఇంకా ఆలోచించలేదని అన్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here