నైట్... 'ఆర్ఆర్ఆర్' ఫైట్!
on Oct 29, 2020
పగలు రాత్రి కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం పని చేస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో హీరోలు ఇద్దరూ ఎన్టీఆర్, రామ్ చరణ్ షూటింగ్ చేస్తున్నారని... వాళ్ళు పాల్గొనగా సినిమాకి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఫైట్ సీన్స్ తీస్తున్నారన్నమాట. ఫైట్ అన్నాక కొట్టుకోవాలి. కొట్టుకున్నాక రక్తం వస్తుంది. అందుకోసం ఆర్టిఫీషియల్ రక్తాన్ని లీటర్లు లీటర్లు సిద్ధం చేస్తున్నారు. పగలు సెట్ వర్క్, చిన్న చిన్న ఆర్టిస్టుల మీద కొన్ని సీన్లు తీస్తున్నారట. మరికొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ జరుగుతుందని టాక్.
ఇటీవల సినిమా నుండి 'కొమురం భీమ్' పాత్రలో నటించిన ఎన్టీఆర్ టీజర్ విడుదల చేశారు. అందులో భీమ్ ను ముస్లింగా చూపించడంపై విమర్శలు వచ్చాయి. ఆదివాసీలు, చరిత్రకారుల నుండి పలువురు రాజకీయ నాయకులు రాజమౌళి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే... ముస్లిం గెటప్ కి, భీమ్ పాత్రకి సంబంధం లేదని 'ఆర్ఆర్ఆర్' యూనిట్ చెబుతోంది.