వాళ్లు 'జెనీలియా హజ్బెండ్' అని పిలిచారు.. రితీష్ దేశ్‌ముఖ్ హర్టయ్యాడు!
on Oct 21, 2020
బాలీవుడ్లో అత్యంత ఇష్టపడే జంటల్లో రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా జోడీ ఒకటి. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న గాఢమైన అనురాగం ఎలాంటిదో ఈ ప్రపంచం చూస్తూనే ఉంటుంది. అలాంటిది తనను జెనీలియా హజ్బెండ్ అని కొంతమంది పిలిచినప్పుడు తన ఇగో హర్టయ్యిందని రితీష్ వెల్లడించడం, షాక్ కలిగించే విషయం. అవును. ఈ విషయాన్ని రితీష్ స్వయంగా చెప్పాడు.
రానున్న 'ద కపిల్ శర్మ షో'లో రితీష్, జెనీలియా గెస్టులుగా కనిపించనున్నారు. దాని ప్రోమో క్లిప్‌లో, రితీష్ షేర్ చేసుకున్న ఓ సంఘటన కపిల్ శర్మను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, అతడిని తెగ నవ్వించింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా, సౌత్ సెలబ్రిటీ లీగ్‌లోని కొంతమంది క్రికెటర్లు తనను జెనీలియ్ హజ్బెండ్ అని పిలవడంతో, తన ఇగో దెబ్బతిందని రితీష్ చెప్పాడు. దానికి తను ఏం రెస్పాన్స్ ఇచ్చాడో కూడా అతను తెలిపాడు. ఇక్కడ నేను జెనీలియా భర్తని. మహారాష్ట్రలో జెనీలియా.. రితీష్ భార్య. ఆ ఆటగాళ్లు అతడిని మళ్లీ కరెక్ట్ చేశారు, సార్.. ఆమె మహారాష్ట్రలో మాత్రమే రితీష్ వైఫ్. కానీ మీరు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళలో జెనీలియా భర్త అని.
వచ్చే శని, ఆదివారాల్లో రాత్రి 9:30 గంటలకు సోనీ టీవీలో ద కపిల్ శర్మ షోలో ఈ ఎపిసోడ్‌ను మనం చూడొచ్చు.