రవితేజ ఐటమ్ గాళ్ ఆర్జీవీ హీరోయిన్!
on Oct 16, 2020
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ప్రస్తుతం రవితేజ, అప్సరా రాణిలపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఎస్. తమన్ స్వరాలు కూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్‌కు జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో, ఉద్వేగభరితమైన కథ, కథనాలతో సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు 'క్రాక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మెర్సాల్', 'బిగిల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
రామ్‌గోపాల్ వర్మ సినిమా 'థ్రిల్లర్' ద్వారా అప్సరా రాణి టాలీవుడ్లో వెలుగులోకి వచ్చింది. ఆమె ఒరియా నటి. ఆ మూవీలో అంగాంగ ప్రదర్శనతో ఆమె రసికులను ఆకట్టుకుంది. లేటెస్ట్గా నైనా గంగూలీ, అప్సరా రాణిలతో వర్మ 'డేంజరస్' అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్‌ను తీస్తున్నాడు. అలాంటి అప్సరా రాణి ఇప్పుడు రవితేజ పక్కన ఐటమ్ గాళ్‌గా కనిపించనున్నది.
Also Read